NDL: పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్ రఫీ నేడు ఉ. 5 గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నంది కోట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గ్రామానికి చేరుకుని రఫీ మృతదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.