ATP: గుంతకల్లు రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని పచ్చ కర్పూరంతో శుద్ధి చేశారు. ఆలయ ప్రెసిడెంట్ బాస్కర్ రంగయ్య మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే మంగళవారం ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.