SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ బీ. శ్యాంసుందర్ ఆధ్వర్యంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. విద్యార్థులు యోగా భ్యాసాన్ని నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని ఆయన సూచించారు.