ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత చవట, దద్దమ్మ అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. రాప్తాడులో ఆమె లేడీ మాఫియా డాన్‌లా వ్యవహరిస్తూ నియోజకవర్గాన్ని రావణకాష్టంగా మార్చారని విమర్శించారు. మజ్జిగ లింగమయ్య హత్యతో ప్రారంభమైన ఆమె పతనం పాపంపేట దోపిడీతో సంపూర్ణమైందని ఆయన వ్యాఖ్యానించారు.