NLR: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రిటైర్డ్ ఉద్యోగి ఒకరు సీటులో కూర్చుని విధులు నిర్వహిస్తుండడాన్ని గమనించి, ప్రైవేటు వ్యక్తి ఎలా పనిచేస్తున్నారని, ఎవరు అనుమతి ఇచ్చారని, ఏం తమాషా చేస్తున్నారా అంటూ సబ్ రిజిస్ట్రార్ రామకోటయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.