కోనసీమ: రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కొల్లి సత్యవతి అనే మహిళ పెంకుటిల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ నేపథ్యంలో రావులపాలెంకు చెందిన శ్రీ కాశీ అన్నపూర్ణదేవి సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యులు మంగళవారం పరామర్శించి బాధిత కుటుంబానికి రూ. 30,116 చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు.