GNTR: ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్. యలవర్తి నాయుడమ్మ జయంతిని బుధవారం తెనాలిలో నిర్వహించారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ & టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెంచుపేటలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపాటి రఘునాధ బాబు, వైస్ ఛైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం పలువురు పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.