VZM: నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్స్‌ను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలెన్సర్స్‌ను తొలగించడం చట్టరీత్యా నేరమని అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం హెచ్చరించారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన సైలెన్సర్స్ని తొలగించి వాటిని రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశామన్నారు.