కోనసీమ: అమలాపురం గడియార స్తంభం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరం నందు గైనకాలజిస్ట్, ఎముకలు, ఆర్థోపెటిక్, జనరల్ మెడిసిన్ వివిధ విభాగాలకు సంబంధించిన డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజల వినియోగించుకోవాలని కోరారు.