SKLM: టెక్కలి మండలం సింగుమహంతిపేట, రెయ్యిపేట గ్రామాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో గణేష్(27), లోకేశ్వరరావు(37) ఇరువురు శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడి గణేష్ మృతిచెందగా, పురుగులమందు తాగిన లోకేశ్వరరావు చికిత్స పొందుతూ మరణించాడని చెప్పారు.