ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకుడు కేశవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డిని కలిసిన కార్మికులు, తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. బదిలీ కార్మికులను, తొలగించిన బాబును పనిలో కొనసాగించాలని, ఎంఎంఆర్ బదిలీ, కోవిడ్ కార్మికులను ఆప్కాస్‌లో చేర్చాలని కోరారు.