BPT: చీరాల మండలం వాడరేవు బీచ్ నందు పర్యాటకుల కోసం నూతనంగా నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్, వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులను బుధవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్ పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని ఎక్కడ రాజీ పడవద్దు అని మహేంద్ర నాథ్ ఏఈకి సూచించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.