ATP: గుత్తిలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గుత్తి తహసీల్దార్ పుణ్యవతికి వినతి పత్రం అందజేశారు. వసతి గృహాలలో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తహసీల్దార్‌కు వివరించారు.