అన్నమయ్య: మదనపల్లెలోని శ్రీ వరాల (ఎగువ) ఆంజనేయస్వామి దేవస్థానంలో మార్చి 27న శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఉదయం 5 గంటలకు గోపూజ, 7.20 గంటలకు కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం ఊరేగింపు, భజనలు, అన్నదానం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 2 నుంచి 41 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.