కృష్ణా: గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కెవిఆర్ కిషోర్ ఆధ్వర్యంలో ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వందల మందికి ఆరోగ్యాన్నిస్తున్న క్రీడా ప్రాంగణం అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.