కడప రైల్వే స్టేషన్లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని సతీశ్ (24) అనే బీటెక్ విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. సతీశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలో అన్నమాచార్య కాలేజీలో బీటెక్ చదువుతున్నాడని వెల్లడించారు.