NTR: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ మండలం గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిపరిశీలించారు. అయన మాట్లాడుతూ.. 4రోజుల పాటు అకాల వర్షాలు ఉన్నందున సాధ్యమైనంత త్వరగా ధాన్యాన్ని మరింత వేగంగా, యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలన్నారు.