VZM: గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. బాడంగి మండలంలోని తెంటువలస గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.