KKD: ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్క అని కలెక్టర్ షన్మోహన్ పేర్కొన్నారు. మెడికవర్ ఆసుపత్రి వారి మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డును ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ ఫ్యామిలీ కార్డు వల్ల మెరుగైన వైద్య సేవలు సామాన్యులకు మరింత చేరువ అయ్యేందుకు ఎంతో దోహద పడతాయన్నారు. కుటుంబ సంరక్షణను, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా ఫ్యామిలీ కార్డ్ ఒక ముందడుగని తెలిపారు.