కృష్ణా: మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం పర్యటించారు. ఈ క్రమంలో గ్రామస్తులు గత 6 సంవత్సరాలు నుండి ఇళ్లు లేక, ఒకే ఇంట్లో రెండు మూడు కాపురాలు, అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలో గ్రామంలో ఇళ్లు లేనివారికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.