KRNL: ఎమ్మిగనూరు మాచాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైకాపా ప్రభుత్వ హయాంలో నాడు-నేడు కింద చేపట్టిన పనులకు మోక్షం కలగడం లేదు. కూటమి ప్రభుత్వం రావడంతో నిధులు విడుదల చేసి పూర్తి చేస్తారన్న ఆశతో ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఎదురుచూస్తున్నారు. ఇక్కడ రూ.2.80 కోట్లతో 20 అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. ముందుగా రూ.కోటి నిధులను విడుదల చేశారు.