PLD: నాదెండ్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 6న శనివారం ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో గురువారం తెలిపారు. ఈ సమావేశానికి మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, గ్రామ సర్పంచులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు.