ప్రకాశం: కనిగిరి అర్బన్ కాలనీలోని ఓ ఇంట్లో రూ. 250,000 విలువ చేసే విద్యుత్ పరికరాలు చోరీకి గురయ్యాయి. కాలనీలో నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్న K. ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి కరెంట్ పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో ఉంచిన ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు, గోడలకు అమర్చిన వైర్లను కూడా గుర్తుతెలియని దుండగులు చోరీ చేసినట్లు పేర్కొన్నాడు.