శ్రీకాకుళం రూరల్ పొన్నం పంచాయతీ పరిధి నవనంబాడులో శివాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపూల పిచ్చి మొక్కలు పెరిగాయి. విషసర్పాలు సంచారం ఎక్కువుగా ఉందని గ్రామస్థులు స్థానిక నాయకులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు స్పందించి పనికిరాని మొక్కలను తొలగించారు. దీంతో ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేశారు.