W.G: పెదఅమిరంలోని మిత్ర హాస్పిటల్లో సీపీఆర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇటీవల హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయని.. అలాంటి సమయంలో సీపీఆర్ ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం చాలావరకు ఉందని హాస్పిటల్ అధినేత డా. మిత్ర తెలిపారు. ప్రతినెల ఒక రోజు ప్రజలకు ఆస్పత్రిలో సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు.