కృష్ణా: ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఘంటసాలలోని మహాత్మాగాంధీ జడ్పీ హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీఓ స్వాతి బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. మండలంలో ఎమ్మెల్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయనే విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు.