సత్యసాయి: జిల్లాలో శుక్రవారం ఉదయం నాటికి నమోదైన వర్షపాత వివరాలను అధికారులు తాజాగా వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మొత్తం నాలుగు మండలాల్లో మాత్రమే వర్షం కురిసింది. ఇందులో అత్యధికంగా గాండ్లపెంట మండలంలో 5.2 మిల్లీమీటర్లు, నంబులపూలకుంటలో 4.2 మి.మీ, లేపాక్షిలో 2.0 మి.మీ, కదిరిలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది.