VZM: రామతీర్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రపంచ దివ్యంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి-1 సూర్యనారాయణ మాట్లాడుతూ.. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యంగుల దినోత్సవ జరుపుకుంటారని తెలిపారు. అలాగే ప్రపంచంలో ఎంతోమంది దివ్యాంగులైన వ్యక్తులు ఉన్నత శిఖరాల అధిరోహించారని పేర్కొన్నారు.