అనంతపురం: గుంతకల్లు పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి రాజేశ్ వినుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలలో పాల్గొని 200, 400, 4×1000 పోటీలలో ప్రథమ స్థానం సాధించాడు. ఈ మేరకు లక్నోలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేశ్ జాతీయ పోటీలకు ఎంపికై కళాశాలకు పేరు తెచ్చారని అధ్యాపకులు అభినందించారు.