CTR: చిత్తూరు మున్సిపల్ షెడ్డులో నూతనంగా నిర్మించిన శునకాల కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. జిల్లాలో 7వేల శునకాలు ఉన్నాయని, వాటికి కుటుంబ నియంత్రణ చేయడమే లక్ష్యమన్నారు. గతంలో ఈ ప్రక్రియకు తిరుపతికి వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం చిత్తూరులోని కేంద్రం ప్రారంభించామన్నారు.