CTR: కుప్పం నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల ధృవీకరణ పత్రాలకోసం సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు కడపిడి వికాస్ మర్మత్ పేర్కొన్నారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఈ నెల 21న రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలాలవారు, 22న కుప్పం మున్సిపాలిటీతో పాటు కుప్పం రూరల్ మండలం వారికి ధృవీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని ఆయన స్పష్టంచేశారు.