BDK: దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన గంగుల సీతమ్మ భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం సందర్శించి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. భవిష్యత్తులో వీరి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.