KDP: పులివెందుల పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో గురువారం నిర్వహించిన పోలియో దినోత్సవ అవగాహన సదస్సులో మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ మాట్లాడుతూ.. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని సూచించారు. ప్రతి చిన్నారికి రెండు చుక్కలు వేయడం ద్వారా పోలియోపై నిరంతర విజయం సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.