GNTR: పొన్నూరులోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం శుక్రవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నేతృత్వంలో VNR కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 850 ఉద్యోగుల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళాకు దాదాపు 32 కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్పారు.