CTR: వాస్తవాలను వక్రీకరించి మద్యం కుంభకోణంలో జగన్ రెడ్డి తమ కొండంత దోపిడీని కప్పిపెట్టుకునే కుట్ర నాటకం ఆడుతున్నారని పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి పేర్కొన్నారు. మద్యం కుంభకోణం అంశంపై స్పందిస్తూ ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ అవినీతి, అక్రమాలను ఎదుటి వారిపై నెట్టడంలో జగన్ అండ్ కో పీహెచ్డి చేశారన్నారు.