కృష్ణా: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మంగళవారం వరకు కృష్ణా జిల్లాలో 3,83,127 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యంలో అత్యధిక వాటా జిల్లాకే దక్కిందన్నారు. 49,132 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, అందులో 47,182 మందికి రూ.864.72 కోట్లను జమ చేసినట్లు చెప్పారు.