TPT: 10 లక్షల 63 వేల రూపాయల CMRF చెక్కులను గూడూరు శాసన సభ్యులు పి సునీల్ కుమార్ అందించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని 9 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) చెక్కులను పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్మెన్ తానంకి నానాజీతో కలసి క్యాంప్ కార్యాలయం నందు లబ్ధిదారులకు అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందించిన చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.