Vsp: విశాఖ నగరంలోని వాణిజ్య, పరిశ్రమల అభివృద్ధికి అనుగుణంగా కొత్త మంచినీటి పైప్లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పీ.సంపత్ కుమార్ తెలిపారు. గురువారం కోరమాండల్ గెస్ట్ హౌస్లో జరిగిన సమీక్షా సమావేశంలో పరిశ్రమల యాజమాన్యాలతో ఈ ప్రాజెక్టుపై చర్చించారు.