ATP: గుంతకల్లు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని రైల్వే కోటర్స్లో నివాసముండే మధుసూదన్ అనే రైల్వే ఉద్యోగి గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యగల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.