ప్రకాశం: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 19వ తేదీన అండర్-17 బాల, బాలికల వాలీబాల్ ఉమ్మడి జిల్లా జట్లు ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఎసీఎఫ్ ఇన్ చార్జి సెక్రటరీ ఎండీ.హజీరాబేగం తెలిపారు. ఉదయం 9గంటలకు త్రోవగుంట హైస్కూలులో నిర్వహించే ఎంపిక పోటీలకు క్రీడాకారులు హాజరుకావాలని, ఆయా ప్రభుత్వ పాఠశాలల వ్యాయామోపాధ్యాయులు ఫారం-బితో వారిని పంపించాలని ఆమె కోరారు.