గుంటూరు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ సోమవారం గుంటూరు జంక్షన్ మీదగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రైలు (నం.07020) విజయవాడలో సోమవారం 18:40 గంటలకు బయలుదేరి గుంటూరు 20:20కు రానుంది. పిడుగురాళ్ల 21:32, నడికుడి 22:08, సికింద్రాబాద్ 04:00, చేరుతోందని చెప్పారు.