KDP: సమస్యల పరిష్కారానికి పోరాడుదామని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారి సమస్యలను ఆయనకి విన్నవించుకున్నారు. ఇందుకు ఆయన స్పందిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.