VSP: పులిచింతల ప్రాజెక్టులో గురువారం 42.16 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు పులిచింతల ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు. ఎగువ నుంచి 58,467 క్యూసెక్కులు ప్రాజెక్టుకు చేరుతోందన్నారు. ప్రాజెక్టు వద్ద 57,596 క్యూసెక్కులు దిగువ కృష్ణాకు విడుదల అవుతోంది. 16వేల క్యూసెక్కులు పవర్ జనరేషన్ ద్వారా కృష్ణానదికి వస్తోంది. రెండు గేట్ల ద్వారా నీరు విడుదల అవుతుందని అధికారులు తెలిపారు.