పల్నాడు : వరుసగా మొసళ్లు రోడ్లపైకి వస్తున్నాయి. తాజాగా ఆదివారం రాత్రి మాచవరం మండలం వేమవరం శివారులో మొసలి కలకలం రేపింది. పొలాల్లో నుంచి మొసలి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. మొసలిని చూసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మొసలిని పట్టుకునేందుకు అటవీశాఖ ప్రయత్నాలు ప్రారంభించారు.