VSP: పరవాడ మండలం లంకెలపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం జరగాల్సిన ఖోఖో ఎంపిక పోటీలు వాయిదా వేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి విశాఖ జిల్లా కార్యదర్శులు దేముడు, నాగేశ్వరరావు, కొండబాబు తెలిపారు. ఈ పోటీలు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియ చేస్తామని వారు పేర్కొన్నారు. వర్షాలు పడుతున్న కారణంగా ఎంపిక పోటీలను వాయిదా వేసినట్లు తెలిపారు.