ATP: పుట్టపర్తికి చెందిన భవాని భర్త కనిపించకుండా వెళ్లిపోవడంతో ముగ్గురు పిల్లల కోసం అహర్నిశలు శ్రమించేది. సెప్టెంబర్ 13న భవాని అనారోగ్యంతో మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఆ అనాథ పిల్లలను అమృత చేరదీసి వారి అలనా పాలన చూస్తోంది. సమాచారం తెలుసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి కొత్తకోట దామోదర్ రూ. 10,000 ఆర్థిక సహాయం చేసి, బట్టలు పంపిణీ చేశారు.