E.G: రాజానగరం మండలం హౌసింగ్ బోర్డ్ కాలనీలో తాగునీరు, ఇతర మౌలిక వసతుల విషయంలో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాజమండ్రి కమిషనర్ కేతన్ గార్డ్‌ను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. సోమవారం రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆయనను కలిసి పలు సమస్యలను వివరించారు.