ELR: ముసునూరు తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులను అధికారులు పట్టించుకోకపోవడంతో.. బాధితులు అర్జీలు ఎవరికి ఇవ్వాలో తెలియక ఎదురుచూశారు. తహసిల్దార్ కె. రాజ్ కుమార్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారని, మిగతా సిబ్బంది ఎవరూ తమను పట్టించుకోవడం లేదని అర్జీదారులు వాపోయారు.