కోనసీమ: ఆలమూరు మండలం చెముడులంకలోని ఓ స్కూల్ కరస్పాండెంట్ తుమ్మ శ్రీనివాసరావు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 30,000 చెక్కును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు సోమవారం అందజేశారు. అలాగే ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి ఇండోర్ ప్లాంట్ను బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్కూల్ యాజమాన్యం విద్యాభివృద్ధికి చేస్తున్న కృషికి అభినందించారు.