ASR: గొల్లపల్లి గ్రామానికి వెళ్లే రహదారులు ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయాయి. నడింవీధి- గొల్లపల్లి మధ్యనున్న కాలువ ప్రమాదకరంగా ప్రవహిస్తుండ టంతో రాకపోకలకు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న ముర్ల సీతమ్మ ఇవాళ తలపై కోడిగుడ్లు, ఇతర సరకులు పెట్టుకుని స్థానికుల సాయంతో ప్రమాదకరంగా గెడ్డ దాటిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.